ఈ అధ్యయనంలో పలు సంస్థలు పాలుపంచుకున్నాయి. డెంగీ కేసులు గత 50 యేళ్లుగా నిలకడగా పెరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా సైంటిస్టులు డెంగీ వైరస్‌కు చెందిన నాలుగు సీరోటైప్‌లపై అధ్యయనం చేశారు. తమ పూర్వ వేరియంట్లతో పోల్చతే ఈ సీరోటైప్‌లు ఎంత మేర రూపాంతరం చెందుతాయన్నది పరిశోధించారు. ఈ పరిశోధన వివరాలను ఓ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.