ఉత్తరాది రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. దీంతో ఈ రాష్ట్రం బీభత్సంగా మారింది. ఒకవైపు వరదలు, మరోవైపు కొండచరియలు విరిగిపడుతూ పర్యాటకులతో పాటు స్థానికుల ప్రాణాలను తీస్తున్నాయి.
చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ హైవే మొత్తం బ్లాక్ అయ్యిందని, కొండలపై నుంచి మట్టిపెల్లలు, రాళ్లు పడుతున్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ రెండు రోజుల్లోనే 23 మంది చనిపోయారని, దాదాపు 100 మందికి పైగా రెస్క్యూ చేసి కాపాడినట్టు అధికారులు తెలిపారు.
కాగా, ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దీంతో వరదలు పోటెత్తాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో.. నైనిటాల్‌కు రాకపోకలు ఆగిపోయాయి.
కేదర్‌నాథ్ టెంపుల్‌కు వెళ్లి వరదలో చిక్కుకున్న 22 మంది భక్తులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు కలిసి కాపాడారు. 55 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి నడవలేని పరిస్థితిలో ఉండటంతో అతన్ని స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు.