ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పీఠం కోసం ఆరుగురు పోటీ!

బుధవారం, 10 మార్చి 2021 (09:19 IST)
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి ఆరుగురు నేతలు పోటీపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్ హోదాలో ఉన్న నేతల పేర్లను భాజపా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బుధవారం జరిగే పార్టీ శాసనపక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆరుగురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. 
 
వీరిలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, రాష్ట్ర మంత్రులు ధన్​సింగ్ రావత్, సత్​పాల్ మహరాజ్ సహా మరికొందరు నేతలను ఇందుకోసం భాజపా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
బుధవారం జరగనున్న పార్టీ శాసనపక్ష సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు, ఛత్తీస్​గఢ్ సీఎం రమణ్ సింగ్ సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. 
 
ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ధన్​సింగ్ రావత్​కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 48 ఏళ్ల ధన్​సింగ్​కు.. మర్యాదస్థుడిగా పేరు ఉంది. త్రివేంద్ర సింగ్ రావత్​కు అత్యంత సన్నిహితుడు. 2017లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరితో పాటు భాజపా జాతీయ ప్రతినిధి అనిల్ బలునీ, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అజయ్ భట్ పేర్లను సైతం అధిష్ఠానం పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. 
 
కాగా, రాజీనామా నాయకత్వ మార్పుపై గత కొంత కాలంగా వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్​ రాణిమౌర్యను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయంతోనే తాను పదవి నుంచి తప్పుకున్నట్టు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు