కాళ్ళని చేతులని నరికి తింటున్నాడు

గురువారం, 2 మార్చి 2017 (18:09 IST)
లక్నో‌లో దారుణం జరిగింది. నజీం మియ్యా అనే 20 సంవత్సరాల యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి తినడం మొదలుపెట్టాడు. ఇది చూసి అతడి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అమరియాలో ఈ దారుణ ఘటన జరిగింది. పిల్లలతో ఆడుకుంటున్న ఓ బాలుడిని నజీం మభ్యపెట్టి శిథిలమైన ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడు. 
 
బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం చేతులు, కాళ్లను ముక్కలుగా చేసుకొని తింటున్నాడు. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి చూడగా రక్తం మడుగులో బాలుడి మ‌ృతదేహం ఉంది. పక్కన కూర్చొని మృతదేహం ముక్కలను నజీం తింటున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కిడ్నాప్‌, హత్య కేసులను నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి