భూమిపై ఇంకా నూకలు మిగిలివున్నాయంటే.. ఇదేరా (Video)

ఠాగూర్

సోమవారం, 27 జనవరి 2025 (09:00 IST)
ఈ భూమిపై నీకు ఇంకా నూకలు మిగిలివున్నాయ్.. అందుకే చావు నుంచి తప్పించుకున్నావ్ అని కొందరు అంటుంటారు. ఈ వ్యాఖ్యలు నిజమే. కొందరికి అదృష్టం అలా ఉంటుంది. తాజాగా ఓ యువకుడు రెండు బస్సుల మధ్య చిక్కుకున్నప్పటికీ చిన్నపాటి గాయం కూడా లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో పాతది అయినప్పటికీ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. 
 
ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ యువకుడు రోడ్డును క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఒక బస్సు వెళుతుండటంతో రోడ్డుపై కాస్త మధ్యలో ఆగాడు. ఇంతలో వెనుక నుంచి తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సు... ముందు వెళుతున్న బస్సును క్రాస్ చేసేందుకు అమిత వేగంతో దూసుకొచ్చింది. దీన్ని గమనించిన యువకుడు.. తప్పించుకునే ప్రయత్నంలో రెండు మధ్యలో చిక్కుకున్నాడు. 
 
దీంతో వేగంగా వచ్చిన బస్సు డ్రైవర్ ఆ వ్యక్తిని గమనించి బస్సును ఆపేశాడు. అదేసమయంలో ఆ వ్యక్తి కిందపడిపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కిందపడిన వ్యక్తి ఏమీ జరగనట్టుగా లేచి నడుకుంటూ వెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో చూస్తుంటే శరీరం గగుర్పాటుకు గురిచేస్తుంది. ఈ వీడియో చేర్ చేసిన నెటిజన్... ఇది మిరాకిల్ అంటూ కామెంట్స్ చేశాడు. 

 

A man got stuck between two buses while crossing the road in Pattukottai, Tamil Nadu. Fortunately, he escaped without any injuries and walked away limping.
This is the miracle, this is the misfortune, this is his. pic.twitter.com/WSgjYMYc1Q

— Venkatesh Garre (@Venkatesh_G1324) January 4, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు