సోషల్ మీడియా వేదికగా లక్షల సంఖ్యలో వీడియోలు పోస్ట్ చేస్తుంటే వాటిలో కొన్ని మాత్రమే
ట్రెండ్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోల ద్వారా అప్పటివరకు తెలియని తమ టాలెంట్ వెలుగులోకి వస్తుంది. అలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇది ఓ తల్లి చేసిన జుగాడ్ అని చెప్పి తీరాల్సిందే. తన కుమారుడుని స్కూలుకు రెఢీ చేసే ప్రక్రియలో భాగంగా, సాక్స్ లేకపోవడంతో దానికి ప్రత్యామ్నాయం కనుగొంది. సాక్స్ లేవనే విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఎవరూ ఊహించని ప్లాన్ వేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
తమ కుమారుడుకి సాక్స్ లేకుండా స్కూలుకు పంపింతే పనిష్మెంట్ ఇస్తారనే భయంతో ఆ తల్లి ఇలాంటి అదిరిపోయే ఐడియాతో మాయ చేసింది. ఇంట్లో మాడిపోయిన కడాయి ఒకటి తీసుకొచ్చి, తన కొడుకు కాళ్లకు నల్లని మసిపూసి అతనికి షూ వేసి స్కూలుకు సిద్ధం చేసి పంపించింది. కాగా, ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.