కారుపై కుక్క మూత్రం పోసిందనీ... ఆ కిరాతకుడు ఏం పని చేశాడో తెలుసా?

గురువారం, 27 అక్టోబరు 2016 (15:48 IST)
మూగజీవుల పట్ల కొందరు కిరాతకులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మొన్నటికిమొన్న చెన్నైలో ఓ కుక్కను మూడంతస్తుల భవనం నుంచి కిందికి విసిరేసి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో ఇద్దరు వైద్య విద్యార్థులు. తర్వాత వీరికి తగిన శాస్తి జరిగిందనుకోండి. తాజాగా ఓ కిరాతకుడు తన కారుపై మూత్రం పోసిందన్న అక్కసుతో అమానుష చర్యకు పాల్పడ్డాడు. ముంబైలో జరిగిన ఓ ఘటన ఎవరినైనా అయ్యో అనిపించక మానదు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. వివరాల్లోకి వెళ్తే సౌరబ్ దుఖాండే అనే వ్యక్తికి చెందిన కారుపై ఓ కుక్క మూత్రం పోసింది. అలా పోయడాన్ని చూసి తట్టుకోలేక పోయిన దుఖాండే... ఆ తర్వాత అది పడుకున్న సమయంలో దానిమీద నుంచి కారుని పోనిచ్చాడు. దీంతో, తీవ్రంగా గాయపడిన ఆ కుక్క నొప్పితో విలవిల్లాడింది. 
 
ఈ అమానుష ఘటనను 'ఫీడ్ ఏ స్ట్రే... ఎవ్రీ డే' అనే ఓ ఫేస్‌బుక్ పేజ్ వెలుగులోకి తెచ్చింది. దీంతో, ఆ పోస్టు వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఈ ఫేస్ బుక్ పేజ్ యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫేస్ బుక్ లో ఈ ఘటన వైరల్ గా మారిన తర్వాత నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మరో నెటిజన్ వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి