వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ఓ అడవి గుండా వెళ్తున్న దారిలో ఇద్దరు బైకు మీద వెళ్తున్నారు. అయితే బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు పులులు కనిపించాయి. భయంతో బండిని ఆపేశారు. అంతే బైకు మీద కూర్చున్న ఇద్దరు వ్యక్తుల దగ్గరకు పులులు వచ్చాయి. వీడియో తీస్తున్న వారు కదలకుండా ఉండాలని వారిస్తుండటం, ఒక పులి కూర్చుని వుండగా.. మరో పులి మాత్రం వ్యక్తులకు వద్దకు వచ్చి అలా వెళ్ళింది.