ప్లీజ్, నేను జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతానో ఎవ్వరకీ చెప్పొద్దు: శశికళ

శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (12:20 IST)
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తరువాత బెంగళూరులో జైలు శిక్ష అనుభవిస్తున్న బహిష్కృత ఎఐఎడిఎంకె నాయకురాలు వికె శశికళ పరప్పన అగహర సెంట్రల్ జైల్ చీఫ్ సూపరిడెంట్‌కు లేఖ రాసారు. తన విడుదలకు సంబంధించిన ఏదైనా సమాచారం తనకు మాత్రమే ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై మూడవ వ్యక్తికి సమాచారం ఇవ్వరాదని ఆమె లేఖలో పేర్కొన్నారు.
 
తన వివరాలను ఎవరుపడితే వారు సమాచార హక్కు చట్టం కింద తీసుకుండటంతో ఆగ్రహం చెందినట్టు తెలుస్తోంది. దీంతో జైలులో తన వ్యక్తగత వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని కోరారు. సమాచార హక్కు చట్టం ద్వారా తన విడుదల వ్యవహారం గురించి తెలుసుకొని మున్ముందు అడ్డంకులు సృష్టిస్తారనే అనుమానంతో ఈ లేఖను రాశానని తెలిపారు. ఇందుకు ఉదాహరణంగా ఒక ఉదంతాన్ని కూడా చేర్చారు.
 
బీహార్‌లో ఖైదీ అయిన వేద్ ప్రకాష్ అర్వన్ గురించి ఆర్టీఐ చట్టం కింద ఒక దరఖాస్తు కోరినప్పుడు జైలు సమాచార చట్టంలోని సెక్షన్ 8(1)(జె)కింద సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని నిషేధించడంతో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వివరాలు ఇవ్వలేదని తెలిపారు. ఇలా తన వివరాలు కూడా ఎవరకీ ఇవ్వకూడదన్నారు.
 
కాగా మునుపటి ఆర్టీఐ సమాచారం ప్రకారం శశికళ జరిమానా చెల్లిస్తే ఆమె విడుదల తేదీ 2021 జనవరి 27గా ఉండనుంది. జరిమానా చెల్లించక పోయినట్లయితే అది ఫిబ్రవరి 2022కు వాయిదా పడుతుంది. జరిమానాగా రూ.10 కోట్లు ముందుగా చెల్లించాల్సి ఉంది. అందుకే ఆమె ప్రతినిధి అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ బెంగళూరులో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు