తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నిచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ(63) జైలు నుంచి విడుదలయ్యారు. జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెను.. శిక్షాకాలం ముగిసినందున బుధవారం విడుదల చేశారు.
అయితే, ఈ నెల 20వ తేదీన కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రస్తుతం ఆమె బెంగుళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమె విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జైలు అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు.
మరోవైపు, శశికళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆమె పల్స్ రేటు నిమిషానికి 76గా, బీపీ 166/86గా ఉన్నాయని బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు ప్రకటించారు.