తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పబ్నాపర పట్టణానికి చెందిన శ్యాం హల్దార్, అతని భార్య చందన, వారి స్నేహితుడు మంటూ హల్దార్ ఓ రైతు ఇంట్లో వ్యభిచార గృహాన్ని నడుపుతూ వచ్చారు. అయితే, తమ ప్రాంతంలో వ్యభిచార గృహం నిర్వహించడంపై దుఖుహల్దార్ అనే 70 ఏళ్ల వృద్ధుడు వ్యతిరేకించాడు.
తమ ప్రాంతంలో వ్యభిచారం నడపడాన్ని వృద్ధుడు అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వ్యభిచార గృహ నిర్వాహకులు కర్రలు, రాడ్లు, ఇటుకలు తీసుకొని దుఖు హల్దార్‌పై దాడి చేసారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దుఖును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోజురోజుకీ మానవత్వం ఎంత మంటకలిసిపోతోందో పశ్చిమ బెంగాల్‌లోని ఘటన నిరూపిస్తోంది.