పుల్వామా అమరుడి శవపేటిక వద్ద సెల్ఫీ.. అల్ఫోన్స్ ఏంటిది?

సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (10:44 IST)
పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు దేశ ప్రజలంతా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ నేపథ్యంలో ఓ సీఆర్పీఎఫ్ జవాను శవపేటిక ముందు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కన్నన్ సెల్ఫీ దిగడం ప్రస్తుతం వివాదానికి తావిచ్చింది. శవపేటిక వద్ద కూడా సెల్ఫీ తీసుకునే సంప్రదాయం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


వివరాల్లోకి వెళితే, అమరవీరుడు వసంతకుమార్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సాగుతున్న వేళ, నివాళులు అర్పించేందుకు వచ్చిన అల్ఫోన్స్, సెల్ఫీలు దిగారు. ఆ ఫోటోలను నెట్టింట పోస్టు చేశారు.
 
కాగా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టడం ఆపై విమర్శలను ఎదుర్కోవడం అల్ఫోన్స్‌కు ఇది తొలిసారి కాదు. గత సంవత్సరం కేరళను వరదలు ముంచెత్తినప్పుడు ఆశ్రయం పొందుతున్న బాధితులను కలిసిన అల్ఫోన్స్, సెల్ఫీలు దిగి పోస్ట్ చేసినప్పుడు కూడా ఆయనపై విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పుల్వామా అమరవీరుడి శవపేటిక వద్ద సెల్ఫీ తీసుకోవడంతో ఎదుర్కొన్న విమర్శలకు అల్ఫోన్స్ ఫైర్ అయ్యారు. తాను నాలుగు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్నానని, తన తండ్రి కూడా సైనికుడేనని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు