భారతీయ రైల్వే శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నటికిమొన్న గాంధీ నగర్ - ముంబై రైలు వరుసగా గురు, శుక్రవారాల్లో ప్రమాదాలకు గురైంది. తొలు రోజున గేదెలను ఢీకొనగా, మరుసటి రోజున గోవులను ఢీకొట్టింది.
క్షేత్ర సిబ్బంది ఈ లోపాన్ని గుర్తించి రైల్వే ఆపరేషన్స్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో రైలును నియంత్రిత వేగంతో 20 కి.మీ. దూరంలో ఉన్న ఖుర్జా రైల్వేస్టేషన్‌కు తీసుకువెళ్లి ఆపారు. అక్కడ 5 గంటలపాటు మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. మొత్తం 1,068 మంది ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోకి తరలించి గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.