కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్ ప్రభు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదముద్ర వేయలేదు. అయితే, సురేష్ ప్రభు రాజీనామాకు బలమైన కారణం ఉంది.
యూపీఏ చివరి మూడేళ్ల పాలనలో 157 ప్రమాదాల్లో 84 మంది మరణించారు. వీరిలో 2011-12లోనే 73 మంది మృత్యువాత పడ్డారు. అలాగే గడచిన మూడేళ్లలో జరిగిన 207 ప్రమాదాల్లో దాదాపు 1,135 మంది మరణించినవారు, గాయపడినవారు ఉన్నారు.
ఇదిలావుండగా తమ హయాంలో రైల్వే భద్రత పెరిగినట్లు, అందుకు యూపీఏ వారి కంటే ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి మద్దతుగా అధికారిక నివేదిక కూడా విడుదల చేసింది. కానీ అందులో రైలు ప్రమాదాలు, వాటి వల్ల మరణించిన వారి సంఖ్యను పేర్కొనకపోవడం గమనార్హం.