ఇటీవల రోహిత్ శేఖర్ తివారీ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. ఈనెల 16వ తేదీన ఆయన ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసును బుక్ చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టుతో రోహిత్ హత్యకు గురైనట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసు విచారణను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
ఈ కేసు విచారణలో భాగంగా రోహిత్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని 8 గంటల పాటు ప్రశ్నించారు. అపూర్వ, ఆమె తల్లిదండ్రులు తమ ప్రాపర్టీపై కన్నేశారని, తన కొడుకుని వారే హత్య చేసి ఉండవచ్చని ఆదివారం రోహిత్ తల్లి ఉజ్వల ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ హత్య కేసులో భార్య పాత్ర ఉన్నట్టు పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు.