మహిళల్లో నెలసరి ఉన్నట్లుండి ఆగితే....?

శనివారం, 20 ఏప్రియల్ 2019 (16:44 IST)
గర్భం దాల్చినప్పుడు, మోనోపాజ్‌కు చేరుకున్నప్పుడు తప్ప మహిళల నెలసరి ఎప్పుడూ క్రమం తప్పదు. అలా తప్పిందటే శారీరక సమస్య కారణమై ఉంటుందట. అధిక ఒత్తిడి కూడా కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంతకాలం పాటు ఒత్తిడి కొనసాగితే మహిళల శరీరం ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి అవసరమయ్యే శక్తి కోసం అండాల విడుదలను ఆపేస్తుంది.
 
ఏదైనా జరగకూడనిది జరిగినా దాని ప్రభావం వల్ల ఈస్ట్రోజన్ పునరుత్పత్తి హార్మోన్లలో తేడా రావచ్చు. ఈస్ట్రోజన్ తగినంత లేనప్పుడు గర్భాశయంలో పల్చని పొర ఏర్పడే పరిస్థితి ఉండదు. దీనివల్ల నెలసరి రాదు. యాంటీ యాక్సిడెంట్లు, పోషకాలు, ప్రోబయోటిక్స్ లోపించిన ఉత్ర్పేరకాలు ఎక్కువగా ఉన్న డైట్ వల్ల ఆర్డినరిన్ థైరాయిడ్ గ్రంధులు దెబ్బ తింటాయి. 
 
చక్కెర ఎక్కువగా ఉండి హైడ్రోలెడిజెట్ ఫాట్స్ కృత్రిమ రంగులు, పురుగుల మందులు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల థైరాయిడ్ ఆర్డినెల్ సమస్యలు తలెత్తుతాయట. పాడిసిల్స్ స్రావం పెరిగితే మిగతా హార్మోన్లు, ముఖ్యంగా లైంగిక వ్యవస్థకు చెందిన హార్మోన్లు కుంటుపడుతాయని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు