పాకిస్థానీ నటులతో సినిమాలు తీసిన ప్రతి ఒక్క నిర్మాత రూ.5 కోట్లను సైనిక సహాయ నిధి(ఆర్మీ రిలీఫ్ ఫండ్)కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలందరూ తప్పక అంగీకరించాలని, రూ.5 కోట్లు ఇచ్చేందుకు నోటిమాటగా కాకుండా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన అన్నారు.
అంతేకాదు, భారతీయ నిర్మాతలెవ్వరూ పాకిస్థానీ నటీనటులను సినిమాల్లోకి తీసుకోవద్దని, ఒకవేళ అలా చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని ఠాక్రే హెచ్చరించారు. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ నటులపై నిషేధం విధించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ఎంఎన్ఎస్.. పలు నిర్మాతల మండళ్లు, ఎగ్జిబిటర్ల మద్దతుసైతం కూడగట్టిన సంగతి తెలిసిందే.