కానీ అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. అయితే అతనికి కరెంట్ షాక్ తగిలిందని భార్య తెలిపింది. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కరన్ దేవ్ సోదరుడు పోలీసులకు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. సుస్మిత, ఆమె బావ రాహుల్ కలిసి తన అన్న కరన్‌దేవ్‌ను హత్య చేశారని ఆరోపించాడు.
అంతేకాదు సుస్మిత, రాహుల్ మర్టర్ ప్లాన్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసుకున్న చాటింగ్‌ను కూడా చూపించాడు. ఈ చాట్‌లో భర్తను చంపేందుకు భార్య చేసిన చాటింగ్ వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆ చాట్స్‌లో సుస్మిత, రాహుల్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది.