భావి తరాలకు ఆదర్శనీయ కూతురు : బీజేపీ నేత గిరిరాజ్

మంగళవారం, 6 డిశెంబరు 2022 (12:03 IST)
ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సింగపూర్‌లో జరిగిన కిడ్నీ ఆపరేషన్ విజయవంతమైంది. ఈయనకు సొంత కుమార్తె రోహిణి కిడ్నీ దానం చేసింది. 40 యేళ్ళ వయసులో ఆమె సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించారు. 
 
దీనిపై బీజేపీ నేత గిరిరాజ్ స్వాగతించారు. భావితరాలకు ఆదర్శనీయమైన కుమార్తె అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతీ తండ్రి నీలాంటి కూతురు ఉండాలని కోరుకుంటాడని రోహిణిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రోహిణి ప్రతి తండ్రికీ గర్వకారణమని చెప్పారు. 
 
40 యేళ్ల వయసులో కిడ్నీ దాతగా మారడం కాస్త ప్రమాదకరమైన నిర్ణయమేనని గిరిరాజ్ అన్నారు. కానీ తండ్రి కోసం ఈ నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం గొప్ప విషయమని చెప్పారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ వచ్చిన 74 యేళ్ళ లలూ ప్రసాద్ యాదవ్‌కు ఆయన పెద్ద కుమార్తె, సింగపూర్‌లో స్థిరపడిన 40 యేళ్ళ రోహిణి కిడ్నీ ఇవ్వడంతో సింగపూర్‌లోనే కిడ్నీ ఆపరేషన్ పూర్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు