దసరా నవరాత్రుల్లో లలితా పంచమి రోజు ఈ పూజ చేస్తారు. సువాసిని పూజ చేసే వారు సూర్యోదయంతో నిద్రలేచి ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకుని ఇంటిని, పూజామందిరాన్ని చక్కగా అలంకరించుకోవాలి. పూజామందిరంలో లలితాదేవిని ప్రతిష్టించుకోవాలి. ఇంటికి ముత్తైదువులను ఆహ్వానించాలి.
ఈ రోజు లలితా పంచమి కాబట్టి మూడు లేదా అయిదు సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయడం ఎంతో మంచిది. అనంతరం అమ్మవారికి చక్రపొంగలి, కదంబ ప్రసాదం, పులిహోర, బూరెలు, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాలు సమర్పించాలి. ముత్తైదువులకు భోజనం పెట్టాలి. ఆపై వాయనం ఇవ్వాలి.