కెనడాలో "ఫెస్టివల్ ఆఫ్ ఇండియా"

కెనడాలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలతో... ఒక సంవత్సరంపాటు భారత్ "ఫెస్టివల్ ఆఫ్ ఇండియా" ఉత్సవాలను నిర్వహించనుంది. "ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ కెనడా" పేరుతో నిర్వహించబోయే ఈ ఉత్సవాలను 2011లో నిర్వహించనున్నట్లు భారత హై కమీషనర్ ఎస్ఎమ్ గవాయ్ వెల్లడించారు.

ఈ విషయమై ఎస్ఎమ్ గవాయ్ ఇండో-కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీసీ) సమావేశంలో మాట్లాడుతూ... "ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఇయర్ ఆఫ్ ఇండియా" అని పిలువబడే ఈ ఉత్సవాలలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నామని చెప్పారు. ఇందులో భాగంగా భారత కళాకారుల ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, అనేక సదస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

అలాగే... చిన్న పిల్లల వైద్యుల కొరత తీర్చేందుకుగానూ కెనడా భారత దేశానికి సహకరించనున్నట్లు ఎస్ఎమ్ గవాయ్ వివరించారు. ఇందుకోసం కెనడాకు చెందిన హెల్తీ కిడ్స్ ఇంటర్నేషనల్ ఆసుపత్రి భారత వైద్యులకు ఒక సంవత్సరంపాటు తగిన శిక్షణను అందజేయనున్నట్లు ఆయన తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి