వరద బాధితులకు "నాట్స్" చేయూత

FILE
ఆంధ్రరాష్ట్రంలో సంభవించిన వరదల ధాటికి సర్వస్వం కోల్పోయిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ముందుకొచ్చింది. వరద బాధితుల కోసం తమ వంతు సాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్న నాట్స్, తమ సహాయ కార్యక్రమాలకు తగిన చేయూతనందించాలని అమెరికాలోని ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి చేసింది.

జలవిలయంతో నీడ కరువై.. కూడు, గుడ్డా లేక అల్లాడుతున్న ప్రజలకు చేతనైన సహాయం చేసేందుకు.. అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారు, ప్రవాస భారతీయులంతా ముందుకు రావాలని నాట్స్ పిలుపునిచ్చింది. ఈ మేరకు సహాయ కార్యక్రమాల్లో భాగంగా, ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్‌ల సహాయంతో సహాయ సామగ్రిని భారతదేశానికి తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

అదే విధంగా ఇప్పటికే తాము ఆంధ్రలోని స్థానిక సంస్థల సహాయంతో వరద తాకిడికి గురయిన కర్నూలు ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను మమ్మురం చేశామని నాట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనుకునేవారు తమ ప్రతినిధులను సంప్రదించవచ్చుననీ.. మరిన్ని వివరాలకోసం తమ వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆ సంస్థ వివరించింది.

వెబ్దునియా పై చదవండి