సీటీఏ ఆధ్వర్యంలో ఐటీ వర్క్‌షాప్

షికాగో తెలుగు అసోసియేషన్ (సీటీఏ) ఆధ్వర్యంలో ఐటీ వృత్తి నిపుణుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకుగానూ ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. 60 మంది ఐటీ వృత్తి నిపుణులు పాల్గొన్న ఈ వర్క్‌షాప్‌లో... రెజ్యూమ్ ప్రిపరేషన్ నుంచి ఇంటర్వ్యూలలో అనుసరించాల్సిన విధానం, సంబంధిత సాంకేతిక అంశాలపై పట్టు తదితర అంశాలపై వక్తలు ప్రసంగించారు.

కాగా... వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఐటీ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తూ... ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవటం వలన ఉద్యోగ భద్రత లభిస్తుందనీ.. తద్వారా మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చునని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే... రాబోయే రోజుల్లో ఐటీ వృత్తి నిపుణులకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ వర్క్‌షాపులను కూడా నిర్వహించడంతోపాటు, కౌన్సెలింగ్ క్లాసులను కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సీటీఏ వెల్లడించింది. వర్క్‌షాప్ నిర్వహణ కోసం కృషి చేసిన పలువురికి సీటీఏ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసింది.

వెబ్దునియా పై చదవండి