హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డ యూకెలో అలాయి బలాయి

ఐవీఆర్

మంగళవారం, 15 అక్టోబరు 2024 (16:50 IST)
ప్రతి దేశంలో ఇప్పుడు ఎన్నో కుల సంఘాలు, మత సంఘాలు రాష్ట్ర సంఘాలు, జిల్లా సంఘాలు ఇలా తెలుగు వారందరూ ఏదో ఒక సంస్థ ద్వారా సంఘాల ద్వారా విడిపోయి ఉన్నారు. అందరిని కులాలకు మతాలకు అతీతంగా అందరిని ఒక వేదికపై తీసుకువచ్చి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు అన్నదమ్ములు మాదిరిగా కలిసి ఉండాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా సీక్క చంద్ర శేకర్ గారు తెలియజేశారు.
 
ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి వచ్చిన మిత్రులు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, సంస్థలకు చెందిన ప్రముఖులు మరియు డాక్టర్స్, ఇంజనీర్స్ వివిధ వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు అందరూ ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని,  అలాయి బలాయి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణకు సంబంధించిన వివిధ రుచికరమైన వంటలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
 
Ex MP Southall వీరేంద్ర శర్మ గారికి మొదటగా అలయ్ బలై కండువా కప్పి ప్రారంభించడం జరిగింది. యూకెలో 20 సంవత్సరాల తర్వాత ఒక మంచి న్యూట్రల్ వేదిక(తటస్థ వేదిక)కి నాంది పలకడం ఎంతో ఆనంద దాయకమని సభ్యులు కొనియాడారు. ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ కూడా మిత్రులను కలిసిన సందర్బాలు బహు తక్కువ. ఐతే ఈ కార్యక్రమం ద్వారా మిత్రులను కలుసుకోవడం ఆనందంగా వుందన్నారు. ఎటువంటి జెండా, అజెండా ఈ కార్యక్రమానికి లేదని, ఇది కేవలం స్నేహపూర్వక కలయికేనని, జమ్మి ఆకు ఇచ్చి పుచ్చుకొని అందరూ అలైబలై చెప్పుకొని తారతమ్యాలను మరచి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నారని ఈ సందర్భంగా సభ్యులు, అతిథులు కొనియాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు