న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు అమ్మాయి... 18 యేళ్లకే అరుదైన గౌరవం

ఆదివారం, 16 జనవరి 2022 (12:06 IST)
న్యూజిలాండ్ దేశంలో ఓ తెలుగు అమ్మాయి అరుదైన ఘతన సృష్టించింది. కేవలం 18 యేళ్ళకో ఆ దేశ ఎంపీగా ఎంపికయ్యారు. ఆ యువతి పేరు గడ్డం మేఘన. ప్రకాశం జిల్లా టంగుటూరు చెందిన మేఘన... న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యారు. 
 
తాజాగా ఆ దేశ పార్లమెంట్‌కు నామినేటెడ్ ఎంపీల ప్రక్రియ జరిగింది. ఇందులో యువత తరపున పార్లమెంటేరియన్‌గా గడ్డం మేఘనకు అరుదైన అవకాశం లభించింది. దీంతో సేవా కార్యక్రమాలు, యువత విభాగనికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె ఎంపికయ్యారు. 
 
ఆమె తండ్రి గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా గత 2001లో న్యూజిలాండ్ వెళ్లారు. అలా అక్కడే పుట్టి పెరిగిన మేఘన... కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అలాగే, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. దీంతో ఆమెకు ఈ అరుదైన గౌరవం దక్కింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు