అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలుగు దంపతులు మృతి

మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (19:11 IST)
తెలుగు దంపతులు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతులు ముషీరాబాద్ గాంధీనగర్ వాస్తవ్యులు. దివ్య ఆవుల, రాజ అనే దంపతులు డల్లాస్ నుంచి ప్రిస్కో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు దివ్య తండ్రి తెలియజేశారు.
 
మంగళవారం ఉదయం ప్రమాదం జరిగినట్లుగా సమాచారం వచ్చిందని, సాయంత్రం 6.30 గంటలకు ప్రమాదం జరిగినట్లుగా చెప్పారని తెలియజేశారు దివ్య బంధువులు.

ప్రమాదం జరిగిన ప్రాంతం స్కూల్ జోన్ అనీ, ఇల్లు కొనేందుకు డల్లాస్ వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టినట్టు సమాచారం. తన కూతురు దివ్యతో పాటు అల్లుడు రాజా అతని స్నేహితుడు ప్రేమ్ నాథ్‌లు ఈ ప్రమాదంలో చనిపోయారని ఆయన తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు