మేష, వృషభరాశి జాతకుల మకరలగ్న ఫలితాలు

మకర లగ్నంలో జన్మించిన మేషరాశి, వృషభరాశి జాతకుల ఫలితాలను పరిశీలిస్తే...

మేషరాశి: మకర లగ్న మేషరాశి జాతకులకు నాలుగవ స్థానంలో శనీశ్వర గ్రహం ఆధిపత్యం వహించడంతో కార్యాచరణలో కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమమని జ్యోతిష్కులు పేర్కొంటున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు మూర్ఖస్వభావులుగా ఉంటారు. ఇతరులకు కీడు కలిగించే ధోరణిని కలిగి ఉంటారు.

అయితే కొన్ని పరిస్థితుల్లో నెమ్మదిగా కార్యచరణ చేయడంలో నిపుణత కలిగి ఉంటారు. లగ్నాధిపతిగా శనీశ్వరుని ఆధిపత్యంలో పాటు అధిపతిగా కుజుడు ఆధిక్యత వహిస్తే వృత్తిపరంగా అభివృద్ది చెందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

వృషభరాశి: మకరలగ్న, వృషభ రాశి జాతకులకు కళత్ర స్థానాధిపతి చంద్రుడు ఐదోస్థానంలో ఉండటంతో యోగఫలాలను ప్రసాదిస్తాడు. గుణశీలవంతురాలు భాగస్వామిగా లభిస్తుంది. భార్య తరపున ఆస్తులు చేరటం వంటివి తటస్థిస్తాయి. ఈ జాతకులు నీతి, నిజాయితీలకు అధిక ప్రాధాన్యత నిస్తారు.

శ్రమించి విజయాన్ని సాధించడంలో ఆసక్తి కలిగి ఉంటారు. కుటుంబీకుల వద్ద ప్రేమానురాగంతో ప్రవర్తిస్తారు. శనీశ్వర, శుక్ర గ్రహాలు తులాం రాశిలో ఆధిపత్యం వహించడంతో అనేక మార్గాల్లో అభివృద్ధి చెందుతారు. పెద్దల పట్ల గౌరవం, మర్యాదపూర్వకంగా ప్రవర్తించే గుణం కలిగి ఉంటారు.

వెబ్దునియా పై చదవండి