గాయత్రీ మంత్రం జపిస్తే.. కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చా..?!

శనివారం, 20 మార్చి 2021 (22:29 IST)
Gayathri Mantra
కరోనా వైరస్ విజృంభిస్తోంది. జనాలు సెకండ్ వేవ్ భయంతో ఆందోళన చెందుతున్నారు. సోషల్ డిస్టన్స్, మాస్కులు పెట్టుకుంటూ.. కరోనా మార్గదర్శకాలు పాటిస్తున్నారు. అంతేగాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు పోషకాహారం తీసుకుంటున్నారు. ఆయుర్వేద సూత్రాలను పాటిస్తున్నారు. నిమ్మరసం, అల్లం వంటివి ఆహారంలో ఎక్కువ చేర్చుకుంటున్నారు. 
 
తాజాగా ఆధునిక వైద్య చికిత్సలతో పాటూ గాయత్రి మంత్రం జపించడం ద్వారా కరోనా వ్యాధిని త్వరగా కోలుకోవచ్చా అనే అంశాన్ని తేల్చేందుకు ఎయిమ్స్ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఈ అధ్యయనాన్ని ఆమోదించినట్టు సమాచారం. ఇందుకోసం మొత్తం 21 మంది పేషెంట్లను ఎంపిక చేశారు. వీరిని అధికారులు రెండు బృందాలుగా విభజించారు. 
 
మొదటి గ్రూపుకు ఆధునిక వైద్య చికిత్సలు అందించడంతో పాటూ గాయత్రీ మంత్రం, ప్రాణాయామం చేయాలని సూచిస్తారు. రెండో గ్రూపుకు మాత్రం కేవలం ఆధునిక చికిత్సను మాత్రమే అందిస్తారు. ఆ తర్వాత వీరు కరోనా నుంచి ఎలా కోలుకున్నారో పరిశీలించి ఓ అంచనాకు వస్తారు. మొత్తం 14 రోజుల పాటు ఈ అధ్యయనం సాగుతుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు