కృష్ణ పక్షంలో వచ్చే ఆషాఢ అమావాస్య బుధవారం పూట (జూలై 31, 2019) వస్తోంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదలటం మంచి ఫలితాలను ఇస్తుంది. దక్షిణాయన పుణ్యకాల ప్రారంభ మాసమైన ఆషాఢంలో భూమాత అమ్మవారిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
ఇంకా ఆషాఢ మాసం అన్నపూర్ణమ్మకు ప్రీతికరమైన రోజు. అందుచేత ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో శుభకార్యాలను పక్కనబెట్టడం చేస్తుంటాం. కానీ ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి కార్యాన్నైనా ప్రారంభించవచ్చు. ఈ రోజున పితృలకు తర్పణాలు ఇవ్వడం ద్వారా సిద్ధులు, మహర్షుల అనుగ్రహం కూడా సిద్ధిస్తుందట.