అరగజా అంటే ఏమిటి? నుదుట ధరిస్తే ఏంటి లాభమో తెలుసుకుందాం..

మంగళవారం, 28 నవంబరు 2023 (19:03 IST)
Aragaja
దైవమూలికలతో కూడిన సుగంధ ద్రవ్యాలలో అరగజా చాలా విశేషమైనది. ఈ అరగజా పూజా సామాగ్రి విక్రయించే దుకాణాలలో అందుబాటులో ఉంటుంది. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. కానీ దీని ఫలితాలు మాత్రం గొప్పగా వుంటాయి. 
 
అరగజాను ఉపయోగించి దైవానుగ్రహం, కులదేవతానుగ్రహం పొందడం సులభమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దేవాలయాలలో అభిషేకానికి ఉపయోగించే ఈ అరగజను నాలుగైదు డబ్బాలుగా కొనిపెట్టుకోండి. 
 
ఒకటి స్వంత వ్యక్తిగత అవసరాలకు, ఇంకొకటి పూజ గదికి, మిగిలిన రెండింటిలో ఒకటి దేవాలయానికి.. వేరొకటి దానానికి ఉపయోగించాలి. అరగజా నుదుటన తిలకంలా ఉపయోగిస్తే.. మనోబలం పలు రెట్లు పెరుగుతుంది. కార్య విజయం కోసం అరగజాను నుదుటన ధరించాలి.
 
దేవాలయాలలో అభిషేక సామాగ్రి కొనుగోలు చేసే సమయంలో అరగజాను కలిపి కొనుగోలు చేయడం ద్వారా అదనపు ఫలాలను పొందవచ్చు. అరగజాతో ఇంట దైవానుగ్రహం, లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది.  
 
శుక్రవారం పూట ఇంటిని శుభ్రపరచడం, పూజ గదిలో రాగి చెంబులో నీటిని వుంచి అందులో అరగజాను వేసి.. నైవేద్యం సమర్పిస్తే.. శ్రీలక్ష్మి ఇంట నివాసం వుంటుందని విశ్వాసం. ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాదులకు అరగజను కొనివ్వడం చేస్తే విజయం, కార్యసిద్ధి చేకూరుతుంది. 
 
అలాగే కాలభైరవునికి కృష్ణ పక్ష అష్టమి రోజున రాహుకాలం సమయంలో అరగజను అభిషేకం కోసం ఇవ్వడం మంచిది. తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే తొమ్మిది గురువారాలు  ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు ఆలయాల్లో కాలభైరవునికి పూజలు జరుగుతాయి. 
 
ఆ సమయంలో తమలపాకు, కొబ్బరి పువ్వులతో పాటు అరగజను కూడా సమర్పిస్తే.. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం లేనివారు, మంచి ఉద్యోగాలు లభించాలనుకునే వారు.. అరగజను శివాలయాలలో జరిగే అభిషేకానికి అరగజను అందించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
అదేవిధంగా ఇంట్లో పూజ మందిరంలోని స్వామి పటలకు పసుపు, కుంకుమ పెట్టేటప్పుడు.. పసుపులో అరగజను కలుపుకోవచ్చు. ఇలా చేస్తే సంపద పెరుగుతుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సువాసన చాలా అరగజను పూజగదిలో వినియోగించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. దీనివల్ల ఇంట్లో మహాలక్ష్మి శాశ్వతంగా కొలువైవుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
శుభకార్యం విజయవంతం అవ్వాలంటే.. ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు అరగజన నుదుటన ధరించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అత్తరు, పునుగు, జవ్వాదు, జాతిపత్రి, జాజికాయ వంటి అనేక మూలికలతో దీనిని తయారు చేస్తారు. శనిదిశ జరుగుతున్నవారు, అష్టమ శని, ఏలినాటి వంటి ఇతరత్రా శని దిశల ప్రభావం తొలగిపోవాలంటే అరగజాను వాడాలి. తద్వారా శని ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు