పౌర్ణమి రోజున శ్రీ లలితా సహస్ర నామ పారాయణం చేస్తే? (Video)

సోమవారం, 29 జూన్ 2020 (20:35 IST)
Lalitha Sahasranam
శ్రీ లలితా సహస్ర నామాన్ని ఉచ్ఛరించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. సహస్రనామాలు అంటే వెయ్యి నామాలు.. అదీ లలితా సహస్ర నామాలు అంటే అమ్మవారి వెయ్యి నామాలు అని అర్థం. శ్రీ లలితా సహస్ర నామ పారాయణంతో పరిపూర్ణ జ్ఞానం చేకూరుతుంది. శ్రీ లలితా సహస్ర నామ పారాయణం ద్వారా పాపాలు హరించుకుపోతాయి.
 
ఇంకా పౌర్ణమి రోజున పూర్తి చంద్రబింబం కనిపించే నాడు.. దేవిని ధ్యానం చేసి.. శ్రీ లలితా సహస్ర నామంతో ఆమెను స్తుతించే వారి సకల సంపదలు చేకూరుతాయి. వ్యాధులు తొలగిపోతాయి. భూత, పిశాచ భయాలు తొలగిపోతాయి. 
 
శ్రీ లలితా సహస్ర నామ పారాయణం చేసే భక్తుని జిహ్వపై.. చదువుల తల్లి సరస్వతీ దేవి నర్తనం చేస్తుందని విశ్వాసం. శత్రువులపై విజయం సాధించే రీతిలో వాక్చాతుర్యత ప్రసాదిస్తుందని నమ్మకం. శ్రీ లలితా సహస్ర నామ పారాయణంతో సమస్త దోషాలు తొలగిపోతాయి.
 
ఇంకా శ్రీ లలితా సహస్ర నామ పారాయణంతో సమస్త దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ సహస్ర నామ పారాయణంతో భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం, జ్ఞానయోగం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు