పురటాసి శనివారాల్లో శ్రీవారి పూజ.. హనుమంతుడిని ఇలా పూజిస్తే..?

శనివారం, 8 అక్టోబరు 2022 (22:57 IST)
పురటాసి శనివారాల్లో తిరుపతి వేంకటాచలపతిని పూజించడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. తిరుపతిలో పురటాసి శనివారం ఆరాధన చాలా మంచిది. లేదా ఇంట్లో వెంకటాచలపతి విగ్రహానికి లేదా పటానికి పూజలు చేయొచ్చు. శనివారం ఉపవాసం చేయడం మంచిది. 
 
పగటిపూట పండ్లు, నీరు మాత్రమే తినడం, రాత్రి సాధారణ భోజనం చేయడం ద్వారా ఉపవాసాన్ని ముగించవచ్చు. సాయంత్రం వేళ సమీపంలోని శ్రీవారి ఆలయానికి వెళ్లి నువ్వుల నూనె కలిపి దీపం వెలిగించాలి. 
 
శనివారపు వ్రతాన్ని అన్ని నెలల్లో ఆచరించవచ్చు. పురటాసి మాసంలోని శనివారం చాలా విశిష్టమైనది. పురటాసి శనివారాల్లో ఉపవాసం ఉంటే ఏడాది పొడవునా శనివారాల్లో ఉపవాసం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. 
 
గ్రహ దోషాలు ఉన్నవారు పురటాసి శనివారాల్లో ఆంజనేయ ఆలయాన్ని సందర్శిస్తే శనిగ్రహ దోషాలను నివారించుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఆంజనేయుడిని పూజిస్తే శివుడిని, విష్ణుమూర్తిని పూజించిన పుణ్యం లభిస్తుంది. గురువారం, శనివారాలు హనుమంతునికి ముఖ్యమైన పూజాదినములు. 
 
ఈ రెండు రోజుల్లో హనుమంతుడిని సింధూరంతో పూజించాలి. వడమాల సమర్పించాలి. ఇంకా శ్రీరామజయం రాసిన కాగితపు మాల ధరించి హనుమంతుని అనుగ్రహం పొందవచ్చు. ఇంకా హనుమంతుడిని తులసి మాల వేసి పూజిస్తే శనిగ్రహదోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు