కర్పూరంతో ఇలా చేస్తే.. కష్టాలుండవు...

ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (05:00 IST)
ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ధనాన్ని సంపాదించే మార్గం తెలియక వివిధ పద్ధతులను పాటిస్తుంటారు. ఏదీ కలిసిరాక చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురై నిరాశకు గురవుతుంటారు. మరికొందరైతే ఎంత డబ్బు వచ్చినా ఆ డబ్బును నిలబెట్టుకోలేక కష్టాల ఊబిలో కూరుకుపోతూ వుంటారు. ఈ కష్టాలన్నింటికి కారణం లక్ష్మీ కటాక్షం లేకపోవడమే. అలాంటి వారు కర్పూరంతో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలతో తులతూగడం ఖాయమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీదేవికి ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. దాంతో పాటు ఐదు కర్పూరం బిల్లలను తీసుకుని ఒక ఎర్రగుడ్డలో మూటగట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి అగరబత్తితో ధూపం వేయాలి. తర్వాత తాము ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఆ తర్వాత ఆ కర్పూరాలతో అమ్మవారికి పూజ చేయాలి. 
 
అంతా అయిన తర్వాత లక్ష్మీదేవి ముందున్న మూటను తీసుకుని బీరువాలో మనం ఎక్కడైతే డబ్బు, బంగారాన్ని దాచుతామో ఆ ప్రదేశంలో వుంచాలి. ఇలా చేస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు