గురు ప్రదోషం రోజున పెరుగన్నం... పరమాన్నం శివునికి సమర్పిస్తే..?

బుధవారం, 7 సెప్టెంబరు 2022 (21:53 IST)
ప్రదోషం త్రయోదశి తిథి నాడు వస్తుంది. అలాగే త్రయోదశి తిథి గురువారం వస్తే గురు ప్రదోషం. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. 
 
ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. ఈ రోజున బిల్వ పత్రాలతో కూడిన మాలను సమర్పించవచ్చు. అలాగే నేతి దీపం వెలిగించి.. బియ్యం, బెల్లం నైవేద్యంగా సమర్పించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
ప్రదోష కాలంలో నటరాజ స్వామిగా శివ స్వరూపుడు చేసే నృత్యాన్ని వీక్షించేందుకు శివాలయాలకు విచ్చేస్తారని విశ్వాసం. ఈ కాలంలో శివునిని ఆరాధిస్తే.. సమస్త దేవతలను ఆరాధించినట్లే. నటరాజ స్వామి నందీశ్వరుని కొమ్ములకు మధ్యలో ఆడే సమయాన్నే ప్రదోష కాలం, ప్రదోష సమయం అంటారు. 
 
అందుకే నందీశ్వరుని కొమ్ముల నుంచి శివుడిని దర్శించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రదోష కాలంలో పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పితృదేవలు, ఏడు తరాల వారు చేసిన పాపాలు హరించుకుపోతాయి.  
 
అలాగే గురు ప్రదోషం జీవితంలో కర్మ ఫలాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. గురు శాపం తొలగిపోవాలంటే.. గురు భగవానుడి అనుగ్రహం పొందాలంటే గురువారం వచ్చే ప్రదోష తిథి నాడు స్వామిని దర్శించుకోవడం ఉత్తమం. గురు ప్రదోషం రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడం వల్ల చివరకు గురు శాపం నుండి విముక్తి లభిస్తుంది. 
 
చివరగా, గురు ప్రదోషం మనకు స్పష్టత, విశ్వాసం, శత్రువులపై విజయం సాధించడానికి తగినంత శక్తిని ఇస్తుంది. గురువారం ప్రదోషం రోజున శివాలయాన్ని సందర్శించడం ద్వారా బృహస్పతి అనుగ్రహం కూడా లభిస్తుందని.. వ్యాపారాభివృద్ధి చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ రోజున సాయంత్రం 4.30 నుంచి ఆరు గంటల వరకు శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో వృద్ధి చెందేందుకు గల అడ్డంకులు తొలగిపోతాయి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున శివునికి పెరుగన్నం, పరమాన్నం నైవేద్యంగా సమర్పించే వారికి ఈతిబాధలుండవు.  
 
ప్రదోష రోజున, మనల్ని పట్టి పీడిస్తున్న పేదరికాన్ని తొలగించడానికి ఆవులకు పచ్చి ఆకు కూరలు అలాగే అవిసె ఆకులను ఆహారంగా అందిస్తే అప్పుల బాధలు వుండవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు