వారాహి దేవిని అమావాస్య, పూర్ణిమ, పంచమి, అష్టమి రోజుల్లో పూజించడం మంచిది. ఈమెకు ఐదు ముఖాల దీపాన్ని వెలిగించడం మంచిది. తీపి బంగాళాదుంప లేదా దానిమ్మను నైవేద్యంగా సమర్పించవచ్చు. వారాహి పూజ సజావుగా జరగడానికి.. ఆశీర్వాదం కోసం ఒక గణేశ మంత్రాన్ని పఠించాలి.
వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది లోపు చేయాలి. పూజ కోసం అమ్మవారి చిత్ర పటం, కాస్త గంధం, తెలుగు రంగు పూలు, సాంబ్రాణి దూపం ఉండాలి. అయితే సాంబ్రాణి బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి ధూపం వేయాలి.