నవగ్రహాలను ఎలా పూజించాలి.. విగ్రహాలను తాకడం పాపమా..? పుణ్యమా?

బుధవారం, 10 ఆగస్టు 2016 (16:58 IST)
నవగ్రహాలను ఎలా పూజించాలి. పూజిస్తే ఫలితాలేంటే తెలుసుకోవాలా.. అయితే ఈ స్టోరీ చదవండి. మన జీవితంలో సుఖసంతోషాలు నవగ్రహాల ప్రభావంతోనే ఏర్పడుతాయని జ్యోతిష్య నిపుణులు అంటుంటారు. నవగ్రహాలను పూజించడం ద్వారా ఆయా జాతకుల దోషాలు తొలగిపోయి.. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. ఇక శనివారాల్లో నవగ్రహాలను పూజించడం ఉత్తమం. 
 
అయితే ఏ గుడికి వెళ్ళినా.. గర్భగుడిలోని స్వామిని దర్శించుకోకుండా నవగ్రహాలకు పూజించడం, ప్రదక్షిణలు చేయడం సరికాదు. ముందుగా వినాయకుడిని దర్శించుకుని.. ఆపై గర్భగుడిలోని దేవతను స్తుతించి.. చివరిగానే నవగ్రహాలను ప్రదక్షణ చేయాలి. ఈ విధానం ద్వారానే శుభఫలితాలు చేకూరుతాయి. గర్భగుడిని దర్శించుకోకుండా.. నవగ్రహ ప్రదక్షణ చేయడం అశుభ, వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
నవగ్రహాలు-యోగాలు 
1. సూర్యుడు- ఆరోగ్యం
2. చంద్రుడు- కీర్తి 
3. అంగారకుడు- సంపదలు
4. బుధుడు- విజ్ఞానం, విద్య 
5. గురువు- గౌరవం, మర్యాద 
6. శుక్రుడు - ఆకర్షణ, కీర్తి
7. శనీశ్వరుడు- సుఖమైన జీవితం
8. రాహువు - ధైర్యం 
9. కేతు - వంశపారంపర్య హోదా, మర్యాద.  
 
నవగ్రహాలను ప్రదక్షణలు చేసేటప్పుడు.. ఆయా గ్రహాలకు నిర్దేశించిన సంఖ్యలోనే ప్రదక్షణలు చేయాలి. ఎలాగంటే.. తొలుత తొమ్మిదిసార్లు చుట్టిన తర్వాత కింద పేర్కొనబడిన నవగ్రహాల ప్రదక్షణ చేసే సంఖ్య ప్రకారం పూజించాలి. 
 
నవగ్రహాలు- వాటి ప్రదక్షణ సంఖ్యలు.. 
సూర్యుడు - 10 సార్లు 
శుక్రుడు - 6 సార్లు 
చంద్రుడు -11 సార్లు 
శని భగవానుడు - 8 సార్లు 
అంగారకుడు - 9 సార్లు 
రాహు - 4 సార్లు 
కేతు - 9 సార్లు 
గురువు- 3, 12, 21 
బుధ గ్రహం - 5, 12, 23 సార్లు ప్రదక్షణ చేయాలి. అలాగే నవగ్రహాలను వాటికి ఎదురుగా నిల్చుని పూజించడం చేయకూడదు. అలాగే విగ్రహాలను తాకి పూజించడం పాపమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి