మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. అదికూడా శనివారం ఈ అమావాస్య రావడం విశేషం. ఈ రోజున నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించాలి. అలాగే దానధర్మాలు చేయాలి. మౌని అమావాస్య ఖచ్చితమైన తేదీ, స్నానానికి శుభ సమయం.. ఈ పవిత్రమైన రోజున ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం..
ఈ రోజున భక్తులు ఉపవాసం వుండి, నైవేద్యాలు సమర్పించడం ద్వారా, దానాలు చేయడం అసాధ్యమైన పనులను పూర్తి చేస్తుంది.
శనివారం మౌని అమావాస్య 20 ఏళ్లలో ఇదే తొలిసారి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. శనివారం వచ్చే అమావాస్యను శనిశ్చరి అమావాస్య అంటారు. ఈ రోజున మౌన ఉపవాసం ఉండి నైవేద్యాలు సమర్పించి, దానం చేసే వ్యక్తికి శని దోషంతో పాటు పితృదోషం, కాలసర్పదోషం నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం.
శనీశ్చరి అమావాస్య నాడు ఏమి దానం చేయాలి
శని అమావాస్య రోజున ఒక పాత్రలో కొద్దిగా ఆవనూనెను తీసుకుని ముఖం నీడను చూసిన తర్వాత దానం చేయండి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ సమసిపోతాయని నమ్ముతారు.
రెండవది నల్ల నువ్వులను నీటిలో కలిపి రావిచెట్టుకు సమర్పించి ఆ తర్వాత నల్ల నువ్వులను దానం చేయవచ్చు. మూడవది ఆవనూనె, పెసరపప్పు, దుప్పటి, ఇనుము దానం చేసే వారు శని అనుగ్రహం లభిస్తుంది. సంపద రెట్టింపు అవుతుంది.