09-12-2018 నుంచి 15-12-2018 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

శనివారం, 8 డిశెంబరు 2018 (17:18 IST)
కర్కాటకంలో రాహువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి, బుధ, గురువు, ధనస్సులో శని, మకరంలో కేతువు, కుంభంలో కుజుడు. ధనస్సు, మకర, కుంభ, మీనంలలో చంద్రుడు. 10న గురు మౌడ్యమి త్యాగం, 13న సుబ్రహ్మణ్య షష్టి, ముఖ్యమైన పనులకు సప్తమి, శుక్రవారం అనుకూలం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. విలువైన కానుకలిచ్చిపుచ్కుకుంటారు. ఖర్చులకు అంతుండదు. డబ్బుకు ఇబ్బంది కలిగిస్తుంది. సన్నిహితులు సహకరిస్తారు. పనులు ముందుకు సాగవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. శనివారం నాడు అప్రయత్తంగా ఉండాలి. గృహ మరమ్మత్తులు చేపడతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. కొత్త పరిచయాలేర్పడుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. వృత్తుల వారికి సామాన్యం. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.  
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆర్థికస్థితి నిరాశాజనకం. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. ఆది, సోమ వారాల్లో ఆకస్మిక ఖర్చులుంటాయి. చేతిలో ధనం నిలవదు పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అవివాహితుల ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. అధికారులకు బాధ్యతల మార్పు, ఆకస్మిక స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నష్టాలు అతికష్టంమ్మీద భర్తీ కాగలవు. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. షాపింగ్, వినోదాలు ఉల్లాసాన్నిస్తాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మంగళ, బుధ వారాల్లో నగలు, నగదు జాగ్రత్త. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుందిం. ప్రియతములను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆందోళన సద్దుమణుగుతుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచరీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఖర్చులకు అదుపు ఉండదు. ధన సమస్య ఎదురవుతుంది. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆది, గురు వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం దూకుడును అదుపు చేయండి. సంతోషకరమైన వార్తలు వింటారు. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మీ పథకాలు ఆకట్టుకుంటాయి. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.    
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితి అనుకూలత ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పదవులు స్వీకరణకు మార్గం సుగమవుతుంది. బాధ్యతలు అధికమవుతాయిత. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా గుర్తుంచుకోవాలి. అనవసర జోక్యం తగదు. మంగళ, శని వారాల్లో ఒత్తిడి, ఆందోళన అధికం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. కొత్త పరిచయాలేర్పడుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రయాణం కలిసివస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శుభకార్య సంప్రదింపులు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకునే విషయంలో మెళకువ వహించండి. పనులు హడావుడిగా సాగుతాయి. గురు, శుక్ర వారాల్లో ఆప్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విజయం సంతోషపరుస్తుంది. గృహ మార్పునకు యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేడుకలు, క్రీడా పోటీలు ఉల్లాసాన్నిస్తాయి.     
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతురా. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఏ విషయాన్ని తెగే వరకు లాగవద్దు. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. విమర్శలు పట్టించుకోవద్దు. శనివారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుకుంటారు. సంతానం వైఖరి అసహానం కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో సమావేశాుల, విందుల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు అప్రమత్తంగా ఉండాలి.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
వ్యవహారానుకూలతకు మరింత శ్రమించాలి. ఆర్థిక లావాదేవీలు చికాకుపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు అంచనాలకు మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింద శ్రమించాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పరిచయస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి సామాన్యం. దైవకార్యంలో పాల్గొంటారు.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం మీ ఓర్పునకు పరీక్షా సమయం. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. పనులు మెుక్కబడిగా పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. వేడుకలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. సంతానం దూకుడును అదుపు చేయండి. ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. పట్టుదలకు పోవద్దు. సందర్భానుసారంగా వ్యవహరించాలి. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. అధికారులు, ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పొదుపు పథకాలు అనుకూలం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమెుత్తం సహాయం క్షేమం కాదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. సంతోషకరమైన వార్తలు వింటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. ఆది, సోమ వారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులకు ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనం మితంగా వ్యయం చేయాలి. కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వేడుక్లో పాల్గొంటారు. విలువైన కానుకలిచ్చుపుచ్చుకుంటారు. లౌక్యంగా వ్యవహరించాలి. చెప్పుడు మాటాలు పట్టించుకోవద్దు. మంగళ, బుధ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పోగొట్టుకున్న పత్రాలు సంపాధిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గత సంఘటనలు పునరావృతమవుతాయి. మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం. గురు, శుక్ర వారాల్లో పనులతో సతమతమవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వీడియో చూడండి... 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు