ప్రపంచానికి సత్యాన్ని అందించి, తాత్త్విక జ్ఞానాన్ని బోధించిన మహర్షిగా శివుడు పరిగణించబడ్డాడు. అందుకే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మహాశివుడు నలుగురు రుషులకు సత్యాన్ని బోధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. దీనినే గురు పౌర్ణమి అంటారు.
పరమేశ్వరుడు సత్యం, క్రియ, యోగం, జ్ఞానం అర్థాన్ని రుషులకు వివరించారు. తల్లిదండ్రులు, భగవంతునితో పాటు గురువుకు ప్రాధాన్యత ఇవ్వాలని శివుడే ప్రబోధించాడు.