స్వచ్ఛంగా.. అద్దంలా మెరిసే ఈ లింగానికి చలువ తత్త్వాన్ని కలిగివుంటుంది. అందుకే స్ఫటిక మాలలను చాలామంది ధరిస్తుంటారు. స్ఫటికం హిమాలయాల్లో, శంకరగిరి పర్వతాల్లో లభిస్తాయి. వీటి విలువ కూడా ఎక్కువే. వ్యాపారులు ఈ స్ఫటిక లింగాన్ని ఇంట్లోనూ లేదా వ్యాపార కేంద్రాల్లో వుంచి పూజించవచ్చు. తద్వారా ఆదాయం, లాభం చేకూరుతుంది. స్ఫటిక లింగాన్ని పద్ధతి ప్రకారం పూజిస్తే ఈతిబాధలుండవు.
విద్యార్థులు కూడా స్ఫటిక లింగాన్ని పూజిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. స్ఫటిక లింగాన్ని పది నిమిషాల పాటు చూస్తూ వుంటేనే మంచి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. స్ఫటిక లింగాన్ని పూజించేవారు నిజాయితీగా వ్యవహరించాల్సి వుంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.