స్వాతి నక్షత్రం- తారాఫలం: స్మార్ట్ ఫోన్ డీపీలో తేనెతుట్టెను వుంచితే?

మంగళవారం, 14 నవంబరు 2023 (16:47 IST)
స్వాతి నక్షత్రం తుల రాశికి చెందినది."స్వాతి" నక్షత్ర జాతకులు స్వతహాగా అన్నీ రంగాల్లో రాణిస్తారు. వీరు స్వేచ్ఛను కలిగివుంటారు. అధిక శ్రమ వీరికి తప్పదు. ఈ నక్షత్రం వాయుపుత్రుడైన హనుమంతునికి సంబంధించినది. సరస్వతీ దేవత ఈ రాశిని పాలిస్తుంది. ఈ జాతకులు విద్యా ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడతారు. తెలివితేటలతో రాణిస్తారు.
 
స్వాతి నక్షత్రం కోసం వివాహానికి ఉత్తమ వయస్సు 23-26 సంవత్సరాల మధ్య ఉంటుంది. వృత్తిపరంగా, వారు 30 సంవత్సరాల వయస్సులో స్థిరంగా ఉంటారు. 60 సంవత్సరాల వయస్సు వరకు ఆర్థిక, వృత్తిపరమైన స్థిరత్వాన్ని పొందుతారు. స్వాతి నక్షత్రం 3, 20, 30, 37, 39, 41, 45, 55, 84 సంవత్సరాలలో చురుకుగా ఉంటుంది.
 
స్వాతి నక్షత్ర జాతకులకు ఆయుర్వేదం.. కఫంతో ముడిపడివుంటుంది. కఫం ప్రధాన విధి కండరాలు, ఎముకలు, కొవ్వును కలిపి శరీరాన్ని రక్షించడం. స్వాతి జన్మించిన వారు ఈ దోషాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తద్వారా వారి జీవక్రియ మెరుగుపడుతుంది. కడుపునొప్పి, అజీర్ణం, ఆకలి లేకపోవడం ఈ నక్షత్ర జాతకులను ఇబ్బంది పెట్టవచ్చు.
 
ఈ నక్షత్ర జాతకులు పగడాన్ని ఉపయోగించవచ్చు. వాయుపుత్రుడైన హనుమంతుడిని పూజించవచ్చు. రాహు దోషాలను, రాహును నియంత్రించడం కోసం దుర్గామాతను పూజించవచ్చు. ఈ నక్షత్ర జాతకులకు కలిసి రావాలంటే.. తేనె గూటి బొమ్మను ఇంట వాడటం, ఫోన్ డీపీలలో వాడటం చేయొచ్చు. పంచభూతాల్లో నిప్పుకు సంబంధించిన ఈ నక్షత్ర జాతకులు.. హోమగుండం, తేనెతుట్టె, అగరవత్తులు వెలుగుతున్నట్లు గల ఫోటోలను డీపీలు, వాల్ పేపర్లలో వాడటం ద్వారా అనుకున్న కార్యాల్లో విజయం సాధించవచ్చు. 
 
ఇలా చేస్తే అనుకూలత పెరుగుతుంది. స్వాతి నక్షత్ర జాతకులకు విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట వంటి నక్షత్రాలు, అర్జున చెట్టు, బెరడు కలిసివస్తాయి. ఈ నక్షత్ర రోజుల్లో స్వాతి నక్షత్ర జాతకులు చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు