వివాహ పంచమి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి..?

శనివారం, 16 డిశెంబరు 2023 (22:30 IST)
వివాహ పంచమి అనేది రాముడు, సీతాదేవి వివాహాన్ని సూచిస్తుంది. వివాహ పంచమి డిసెంబర్ 17వ తేదీన వస్తుంది. డిసెంబర్ 16, 2023 రాత్రి 8:00 గంటలకు ఈ పంచమి తిథి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 17, 2023 సాయంత్రం 5:33 గంటలకు పంచమి తిథి ముగుస్తుంది. పూజకు అనుకూలమైన ముహూర్తం: డిసెంబర్ 17.. ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 12:20 వరకు
 
వివాహ పంచమి శ్రీరాముడు, సీతా దేవిల వివాహాన్ని గుర్తుచేస్తుంది, ఇది ఆదర్శ ప్రేమ, భక్తి, నిబద్ధతకు నిదర్శనం. ఈ శుభ సందర్భాన్ని భక్తులు దైవ దంపతులైన సీతారాములను ప్రార్థిస్తారు.  
 
పూజ విధి:
 
ఇంటిల్లా పాదిని శుభ్రం చేసుకుని.. పూజా గదిని పూజకు సిద్ధం చేసుకోవాలి. అలంకరించబడిన వేదికపై శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలను ఉంచాలి. పువ్వులు, పండ్లు, స్వీట్లు, ఇతర నైవేద్యాలను సమర్పించాలి. రాముడు, సీతాదేవికి అంకితమైన మంత్రాలు, శ్లోకాలను పఠించాలి. 
 
సీతారాముల వారి వివాహ కథను వినాలి.
పెళ్లికాని కన్యలు ఈ రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉండి మంచి భర్తను పొందాలని కోరుకుంటారు. రామభక్తులు సీతారాముల వారి ఆలయాలను సందర్శిస్తారు. 
 
వివాహ పంచమిని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
 
 సుఖమయమైన వైవాహిక జీవితం. భార్యాభర్తల మధ్య బంధాలను బలపరుస్తుంది. 
 
ప్రేమ, భక్తిని పెంపొందింపజేస్తుంది. సీతారాముల వారి ఆశీస్సులు లభిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు