ఆధార్ కార్డులోని తప్పొప్పులతో పాటు వయసు, ఇంటి చిరునామా వంటి వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం విధించిన గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ గడువును మరోమారు పొడగించింది. గతంలో పొడిగించిన గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనున్న విషయం తెల్సిందే. తాజాగా పెంచిన గడువు వచ్చే యేడాది మార్చి 14వ తేదీతో ముగియనుంది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) నిబంధనల మేరకు రేషన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు లేదా పాస్ పోర్టు లేదా కిసాన్ ఫోటో పాస్ బుక్ లేదా టీసీ లేదా మార్కుల జాబితా లేదా పాన్ కార్డు లేదా ఈ-పాన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్‌తో చిరునామా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, వాటర్, గ్యాస్ బిల్లులను కూడా చిరునామా ధృవీకరణ కోసం సమర్పించవచ్చని యూఐడీఏఐ చెబుతుంది. అయితే, ఈ బిల్లులు మూడు నెలల్లోపు చెల్లించినవిగా ఉండాల్సివుంది.