జూలై 01-07-2018 నుండి 07-07-2018 వరకు మీ వార రాశి ఫలితాలు(video)

శనివారం, 30 జూన్ 2018 (16:34 IST)
మిధునంలో రవి, కర్కాటకంలో రాహువు, బుధ, శుక్రులు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజ, కేతువులు. మకర, కుంభ, మీన, మేషంలో చంద్రుడు. 4న శుక్రుడు సింహ ప్రవేశం. 1న సంకట హరచతుర్థి. ముఖ్యమైన పనులకు సప్తమి, గురువారం శుభదాయకం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ఒక సమాచారం ఆరోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యవహారానుకూలత ఉంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. ఒత్తిడి తొలగి కుదుటపడుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురు, శుక్ర వారాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్య ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం ఉన్నత విద్యలపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శుభకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలం. గృహమార్పు కలిసివస్తుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మెుండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాగ్రత్త. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. బాధ్యతల నుండి తప్పుకుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్ననాటి పరిచయస్తుల తారసపడుతారు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు హోదా మార్పు. నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
మిధునం: మృగశిర, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. అప్రమత్తంగా వ్యవహరించాలి. శ్రమ అధికం, ఫలితం శూన్యం. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి సారిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలుగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. మంగళ, బుధ వారాల్లో విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. గృహమార్పు నిదానంగా ఫలిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు అధికమిస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాల్లో మెళకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆర్థికస్థితి సామాన్యం. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆది, గురు వారాల్లో ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆత్మీయుల సాయం అందుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒక కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. మానసికంగా స్థిమిత పడుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొంత మెుత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఓర్పు, శ్రమాధిక్యతతో పనులు పూర్తిచేస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. యత్నాలు కొనసాగించండి. మీ కృషి ఫలించే రోజు త్వరలోనే ఉంది. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మంగళ, శని వారాల్లో విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానానికి నిదానంగా ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. గృహంలో మార్పులు చేపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. గురు, శుక్ర వారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. సహాయం ఆశించవద్దు. దంపతులకు అవగాహన ప్రధానం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, విశ్రాంతి లోపం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త.  
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
సంప్రదింపులు అనుకూలం. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. మీ శ్రీమతి సలహా పాటించండి. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. ఆత్మీయులను కలుసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. ఆర్థికంగా మెరుగనిపిస్తుంది. అవసరాలు నెరవేరుతాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. శనివారం నాడు అవసరం జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. వివాహయత్నానికి శ్రీకారం చుడతారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. పట్టుదలకు పోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహమార్పు అనివార్యం. ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆప్తుల కలయికతో కుదటపడుతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదా మార్పు. ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వివాదాలు పరిష్కామవుతాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. గృహమార్పు కలిసివస్తుంది. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు, పరిచయాలు అధికమవుతాయి. తొందరపడి హామీలివ్వవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మంగళ, బుధ వారాల్లో పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. వాగ్ధాటితో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. అనేక పనులతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. కుటుంబీకుల కోసం వ్యయం చేస్తారు. వస్తువుల కొనుగోనులో నాణ్యతను గమనించండి. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ధనసహాయం ఆశించవద్దు. మీ గౌరవాభిమానాలకు భంగం కలిగే ఆస్కారం ఉంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆప్తులను కలుసుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ అవసరం. విద్యాప్రకటనలను విశ్వసించవద్దు. ఆది, గురు వారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఈ ఇబ్బందులు, సమస్యలు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి. గృహమార్పు వలన ప్రయోజనం ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. మంగళ, శని వారాల్లో అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. నిర్మాణాలు, మరమ్మత్తులు వేగవంతమవుతాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు లాభిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వీడియో చూడండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు