వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

ఐవీఆర్

మంగళవారం, 7 అక్టోబరు 2025 (23:10 IST)
మొబైల్ ఫోన్లను వాడేవారు వాటి పట్ల ఎంతో జాగ్రత్తగా వుండాలి. చాలామంది గంటలకొద్దీ ఫోనులో మాట్లాడుతూ, బ్యాటరీ అయిపోతుందనీ, చార్జింగ్ వైర్ పెట్టి మాట్లాడేస్తుంటారు. ఇలా రకరకాలుగా ఏవి చేయకూడదో అలాంటివి చేస్తూ ప్రమాదాలను తెచ్చుకుంటారు. అందుకే సెల్ ఫోన్ వాడకం గురించి తెలుసుకోవడం మంచిది.
 
ఇక అసలు విషయానికి వస్తే... బ్రెజిల్ దేశంలో ఓ యువతి సరుకులు తీసుకుంటూ వుండగా అకస్మాత్తుగా తన ప్యాంటు వెనుక జేబులో వున్న మొబైల్ ఫోను పేలింది. ఈ ఘటనతో ఆమె కేకలు వేస్తూ పరుగులు తీసింది. ఐనప్పటికీ ఆమె చేతులకు, వెనుక భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అంతా కెమేరాలో రికార్డయ్యింది. చూడండి ఆ వీడియోను...

SHOCKING: మహిళ ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్‌

బ్రెజిల్‌లో చోటు చేసుకున్న ఘటన

భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె వెనక పాకెట్‌లో ఒక్కసారిగా పేలిన ఫోన్

ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలు

సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు pic.twitter.com/2q6IjxASbD

— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు