సుందరకాండ పారాయణంతో సుఖ ప్రసవం.. ఆసనం వేశాకే ఆ పని చేయాలట..? (video)
శుక్రవారం, 22 మే 2020 (15:25 IST)
Sundarakanda
మన జీవితంలోని సమస్యలను, ఈతిబాధలను తొలగించే ఓ పారాయణాన్ని మన పెద్దలు పాటించి.. సుఖసంతోషాలను పొందివున్నారు. ఆ పారాయణం ఏంటంటే? రామాయణంలోని ఐదవ కాండంగా వున్న సుందరకాండ పారాయణం. రామాయణం మానవాళికి లభించిన పరమ పవిత్ర కావ్యం. సకల సందేహాలను దూరం చేసి పవిత్ర ధర్మమార్గములను సూచించిన దివ్య రచనామృతం.
ఇతిహాసములలో రామాయణం భారతీయ వాఙ్మయములో తలమాణిక్యము. ఇందులో సుందరకాండ రత్నం లాంటిది. సుందరకాండకు రామాయణంలో అంతటి విశిష్టత ఎందుకు లభించిందంటే.. ఈ కాండంలో రామబంటు హనుమంతుని గురించి పూర్తిగా చెప్పబడటమే. హనుమంతుని సాహసాలు, ఆయనలోని గుణాతిశయాలను ఈ కాండంలో సుందరంగా చెప్పారు.
రామాయణంలో హనుమంతుని ప్రవేశానికి తర్వాతనే శ్రీరామునికి, సీతమ్మకు శుభవార్తలు వింటారు. హనుమరాకతోనే రామాయణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. రామాయణంలో 2400 శ్లోకాలున్నాయి. సుందరకాండలో 2855 శ్లోకాలు, 68 అధ్యాయాలున్నాయి. వేదమంత్రాలిచ్చే అన్నీ మంగళాలను సుందరకాండ ఒకటే అనుగ్రహిస్తుంది.
సుందరకాండ పారాయణంతో కలిగే ప్రయోజనాలేంటి..? సుందరకాండను పారాయణం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలను గురించి తెలుసుకుందాం. సుందరకాండంలోని శ్లోకాల మహిమను వెయ్యి నాలుకలు కలిగిన ఆదిశేషుని వల్ల కూడా వివరించడం కష్టతరమని ఉమాసంహితంలో పరమేశ్వరుడు పేర్కొన్నారు. సుందరకాండలోని ప్రతి సర్గం మహామంత్రానికి సమానమైందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
hanuman
సుందరకాండను పారాయణం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయి. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. ధనలాభం చేకూరుతుంది. సుందరకాండను మనం రోజువారీగా చదవడం ద్వారా.. ఆ పారాయణాన్ని నిష్ఠతో స్తుతించడం ద్వారా మనం భగవంతునికి దగ్గరవుతున్నామని అర్థం. సుందరకాండ పారాయణంతో నవగ్రహ దోషాలు అంటవు. ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అష్టమ శని, ఏలినాటి శని జరుగుతున్న జాతకులు సుందరకాండను చదవడం ద్వారా ఈతిబాధలుండవు.
సుందరకాండ పారాయణం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు, కష్టనష్టాలు తొలగిపోతాయి. సుందరకాండను పారాయణం చేసేవారికి మనోధైర్యం పెంపొందుతుంది. సుందరకాండ పారాయణంతో పాటు హనుమంతుడిని పూజించడం ద్వారా కీర్తి, సంపద, ధైర్యం వంటివి లభిస్తాయి. వాక్చాతుర్యత, జ్ఞానం పొందాలంటే.. తప్పకుండా సుందరకాండ పారాయణం చేయాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
కార్య విఘ్నాలు తొలగిపోయి.. పాపాలు హరించుకుపోతాయి. హనుమంతునికి వడలు, వెన్నను వుంచి.. నేతి దీపం వెలిగించి సుందరకాండను పారాయణం చేయడం ద్వారా సంతానం లభిస్తుంది. శ్రీరామనవమి రోజున రామునికి తులసీ మాలను సమర్పించి.. సుందరకాండను చదివిని వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి.
అనుకున్న కార్యాల్లో విజయం వరిస్తుంది. సుందరకాండను పఠించడం ద్వారా వేదాలను అభ్యసించిన పుణ్యాన్ని మహిళలు పొందవచ్చు. గాయత్రీ మంత్రానికి సమానమైన శక్తి కలదని చెప్పుకుంటున్న సుందరకాండను పఠించడం ద్వారా లక్ష్యాన్ని సాధించే మనోధైర్యం, జ్ఞానం పెంపొందుతుంది.
సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. స్నానమాచరించి.. పూజగదిలో దీపం వెలిగించి.. శుచిగా వున్న ప్రాంతంలో సుందరకాండ పారాయణం చేయడం ప్రారంభించాలి. ఉదయం, సాయంత్రం పూట సుందరకాండ పారాయణం చేయవచ్చు. సుందరకాండ పారాయణం చేసేటప్పుడు సమీపంలో ఓ చిన్నపాటి ఆసనాన్ని వేసి వుంచాలి. రామనామం ఎక్కడ ఉచ్ఛరించబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఆసీనుడవుతాడని నమ్మకం.
అందుకే సుందరకాండ పారాయణం చేసేటప్పుడు చిన్నపాటి ఆసనాన్ని ఆయనకంటూ వేసి వుంచాలి. మహిళలు నెలసరి సమయాల్లో సుందరకాండ పారాయణం చేయకూడదు. వారి వారి స్థోమతకు తగినట్లు హనుమంతునికి నైవేద్యం సమర్పించుకోవచ్చు. అలా చేయని వారు.. శుభ్రమైన నీటిలో పంచదార లేదా బెల్లం కలిపి హనుమకు నైవేద్యంగా సమర్పించవచ్చు.
hanuman
సుందరకాండను చదివే రోజుల్లో మాంసాహారాన్ని తీసుకోవడం కూడదు. గర్భిణీ మహిళలు.. గర్భం ధరించిన నాటి నుంచి ప్రసవం వరకు రోజూ సుందరకాండ పారాయణం చేయడం ద్వారా సుఖ ప్రసవం జరుగుతుందని.. పుట్టే శిశువు ఆరోగ్యంగా, ఆధ్యాత్మిక చింతనతో జన్మిస్తుందని విశ్వాసం. అలా కాకుండా గర్భం ధరించిన ఐదో నెల నుంచైనా సుందరకాండను పఠిస్తే.. సుఖ ప్రసవం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.