గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 దేవతామూర్తుల శక్తి (video)
బుధవారం, 12 ఆగస్టు 2020 (23:26 IST)
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా వుంటుంది. ఈ 24 గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రి అని పేరు. ఈ మంత్రంలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై వున్నాడు. వారెవరో తెలుసుకుందాం.
1. తత్ - విఘ్నేశ్వరుడు
2. స - నరసింహస్వామి
3. వి- శ్రీమహావిష్ణువు
4. తుః - శివుడు
5. వ- శ్రీకృష్ణుడు
6. రే - రాధాదేవి
7. ణ్యం - శ్రీమహాలక్ష్మి
8. భ- అగ్నిదేవుడు
9. ర్గః - ఇంద్రుడు
10. దే - సరస్వతీదేవి
11. వ - దుర్గాదేవి
12. స్య - ఆంజనేయ స్వామి
13. ధీ - భూదేవి
14. మ- సూర్యభగవానుడు
15. హి- శ్రీరాముడు
16- ధి- సీతాదేవి
17. యో - చంద్రుడు
18. యో- యముడు
19. నః - బ్రహ్మ
20. ప్ర - వరుణుడు
21. చో - శ్రీమన్నారాయణుడు
22. ద- హయగ్రీవుడు
23. యా - హంసదేవత
24. త్ - తులసీమాత
ఈ 24 దేవతలకు మూలమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్తశుభాలు కలుగుతాయి.