సుబ్రహ్మణ్య స్వామి కొన్ని క్షేత్రాలలో ప్రధానం దైవంగా, మరికొన్ని క్షేత్రాలలో ఉప ఆలయాలలోను దర్శనమిస్తుంటారు. స్వామివారు ఎక్కడ కొలువైనా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామివారు కొన్ని క్షేత్రాలలో సర్ప రూపంలో, మరికొన్ని క్షేత్రాల్ల బల్లెం ధరించిన బాలుని రూపంలో పూజలు అందుకుంటుంటారు.
సుబ్రహ్మణ్య స్వామివారికి మంగళవారం ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్వామివారిని దర్శించుకునేవారి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. మంగళవారం రోజున స్వామివారికి అరటిపండ్లు, పటిక బెల్లం వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి.