హెచ్1బి వీసా ఫీజు పెంపు... అమెరికా కంపెనీలపై రూ.1.23 లక్షల కోట్ల భారం

ఠాగూర్

సోమవారం, 22 సెప్టెంబరు 2025 (20:20 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ టెక్ కంపెనీలపై రూ.1.23 లక్షల కోట్ల ఆర్థిక భారం పడింది. హెచ్1బి వీసా ధరలను ట్రంప్ సర్కారు పెంచింది. ఈ భారం టెక్ కంపెనీలపై పడనుంది. దీంతో టెక్ కంపెనీలు యజమాన్యాలు ఇక నుంచి హెచ్1బి వీసాలపై ఏటా 14 బిలియన్ డాలర్ల మేరకు వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారీగా పెంచి లక్ష డాలర్లు చేయడం సంస్థలకు మోయలేని భారంగా మారే ప్రమాదం ఉందని ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఫిబ్రవరిలో లాటరీలో రానున్న ఈ కొత్త దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తించనుంది. అయినప్పటికీ టెక్ కంపెనీలు భారీగా వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్‌లో పెంచిన ధరల్లో వీసాలను జారీ చేస్తే వాటి కోసం చెల్లించాల్సిన ఫీజు మొత్తం 14 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.1.23 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 
 
కాగా, భారత్ నుంచి అమెరికా వెళ్లే విమాన టికెట్ల ధరలు అమాంతం పెరగడం వెనుక ఓ భారీ ఆన్‌లైన్ కుట్ర దాగి ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. హెచ్-1బీ వీసాదారులను అమెరికా రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రంప్ మద్దతు బృందం 'మాగా' (మేక్ అమెరికా గ్రేట్ అగైన్), ప్రముఖ ఆన్‌లైన్ ఫోరమ్ '4చాన్' కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. 'క్లాగ్ ద టాయిలెట్' అనే పేరుతో వీరు ఓ ఆపరేషన్ చేపట్టి, కృత్రిమ డిమాండ్ సృష్టించి టికెట్ల ధరలు ఆకాశాన్నంటేలా చేశారు.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజుల పెంపుపై ప్రకటన చేసిన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకుంది. సాధారణ రోజుల్లో న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు ఎకానమీ క్లాస్ టికెట్ ధర సుమారు రూ.37,000 ఉండగా, శనివారం నాటికి అది ఏకంగా రూ.80,000 దాటింది. ఈ ఆకస్మిక పెరుగుదలతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
 
ఈ కుట్రను అమలు చేయడానికి 4చాన్ ఫోరమ్‌లో దాని యూజర్లకు స్పష్టమైన పిలుపునిచ్చారు. 'హెచ్-1బీ గురించి భారతీయులకు ఇప్పుడే తెలిసింది. వాళ్లను అక్కడే ఆపాలనుకుంటున్నారా? ఫ్లైట్ రిజర్వేషన్ సిస్టమ్‌ను అడ్డుకోండి. భారత్-అమెరికా మధ్య ప్రధాన రూట్లలో టికెట్లు బుక్ చేసే ప్రక్రియ మొదలుపెట్టి, సీట్లు ఎంపిక చేసుకోండి. కానీ డబ్బులు చెల్లించకుండా 15 నిమిషాల పాటు సీట్లను హోల్డ్‌లో పెట్టండి. ఇదే పనిని పదే పదే చేయండి' అని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు