ఈశ్వరుడిని ఆరాధించడం అంటే చాలామంది సహజంగా ఇళ్లలోనే ఫోటోలను పెట్టుకుని చేస్తుంటారు. కానీ చాలామంది ఆలయాల ప్రాంగణంలో దొరికే శివ లింగాలను తీసుకుని వాటికి పూజ చేయాలని అనుకుంటారు. దీనితో వాటిని కొనుక్కుని ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టి ఆ శివ లింగానికి పూజలు చేయాలని అనుకుంటారు. కానీ వాటిని పూజ గదిలో పెట్టరాదు అని తెలిసినప్పుడు వాటిని ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతారు.
నిజానికి ఇంట్లో శివ లింగాలను వుంచకూడదని శాస్త్రాలు చెపుతున్నాయి. కనుక స్పటిక లింగం, పాల రాయితో చేసిన లింగాన్ని కానీ లేదంటే నల్లరాతితో చేసిన దాన్ని కానీ... ఇలా దేనితో చేసిన శివ లింగాన్ని కూడా వుంచకూడదు. శివ లింగాలను ఇంట్లో వుంచి పూజ చేస్తే దోషమని అంటారు కనుక వాటిని దేవాలయాల్లోనే ఆరాధించాలని పండితులు చెపుతున్నారు.